- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, కొత్తగూడ: గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఏజెన్సీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్మి గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్మన్లు ఆంగోత్ బిందు, కుసుమ జగదీష్, ములుగు శాసనసభ్యురాలు సీతక్కలతో కలిసి మంత్రి సుమారు రూ.70 లక్షలతో బీటి రోడ్డు, రూ. 20 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం భవన నిర్మాణం పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నీటి ఎద్దడిపై నీటిపారుదల ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులకు పాకాల చెరువు నీటిపై ఎత్తిపోతల పథకం నిర్మించి ఈ ప్రాంతంలోని గొలుసు కట్టు చెరువులన్నింటినీ సాగునీరుతో నింపుతామన్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి కొరత ఉండదన్నారు.
కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ గిరిజన యువత చదువుకోవాలన్నారు. పిల్లల చదువునే పెద్దలు ఆస్తిగా పరిగణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి హేమలత, తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో భారతి, సీఐ షేక్ యాసీన్, ఎస్ఐ నగేష్, డీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మానబోయిన వేణు, ఓడీసీఎంఎస్ వైస్ చెర్మన్ దేశిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.