- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA Kaushik Reddy : ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది
దిశ, కమలాపూర్: ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,15 రోజుల నుంచి ఒక్క గింజ కూడా కొనుగోలు జరపలేదని, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులోఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు వద్దని, మద్దతు ధర బోనస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కష్టానికి కనీసం న్యాయం చేయని రేవంత్ సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కేసీఆర్ హయాంలో రైతుల పంటలు మిల్లులకు చేరక ముందే సంచులు పంపించి, మిల్లులు, ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లు చేసి, ప్రతి గింజను కొనుగోలు చేసే చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. కానీ రేవంత్ సర్కార్ వచ్చి నెలరోజులైనా ఇప్పటివరకు వడ్లు కొనడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. కోతులు, పందికొక్కులు పంటలను నాశనం చేస్తుండగా, రైతులు కల్లాల కాడా కాపలా కాస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో రైతుల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ముఖ్యమంత్రిగా వడ్ల కొనుగోలుపై ఒక్కరోజైనా రివ్యూ చేపట్టారా?” అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల ఓట్లు కావాలని మాత్రమే కాకుండా, వారి పంటలకు సకాలంలో మద్దతు ధర ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మక్కలను కొనుగోలు చేసే కేంద్రాలు లేవని, పత్తికి కనీస మద్దతు ధర కూడా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “7,521 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పత్తిని రైతులు కేవలం రూ. 5000 కు అమ్ముకుంటున్నారన్నారు.
పత్తికి మద్దతు ధర లేకపోవడం, మక్కలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతులను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది,” అని కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రైతులకు నిజమైన సేవకుడని కరోనా సమయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు అందించిన విషయాన్ని గుర్తు చేసి, “కేసీఆర్ రైతుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు ఆపారు కానీ, రైతుబంధు ఆపలేదన్నారు.10 సంవత్సరాల పాలనలో 11 సార్లు రైతులకు రూ. 72,815 కోట్ల రైతుబంధు అందించారన్నారు. కౌశిక్ రెడ్డి, “రైతులకు గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు వంటి చిన్న సహాయం కూడా చేయడానికి రేవంత్ రెడ్డికి సరైన తెలివి లేదా?” అని ప్రశ్నించారు.
రాజకీయ నేతలు రైతుల పట్ల తమ బాధ్యతను మరచిపోవడం సరికాదని, రైతుల పక్షాన నిలబడి తక్షణమే స్పందించాలని కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి వడ్ల కొనుగోలు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి, ప్రభుత్వాన్ని నిలదీస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు కళ్యాణి లక్ష్మణ్, నవీన్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, కమలాపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, కమలాపూర్ మాజీ ఎంపీటీసీలు, అశోక్ మెండు, రమేష్ మాట్లా, వెంకటేశ్వర్లు, కమలాపూర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఇతర గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.