- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి ఎర్రబెల్లి
దిశ, దేవరుప్పుల: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 8వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభకు దేవరుప్పుల మండలం నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్రంలోని మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, ఎంపీపీ బస్వ మల్లేష్, జడ్పీటీసీ పళ్ల భార్గవి, సుందర్, రాంరెడ్డి, తీగల దయాకర్ గౌడ్, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, చింత రవి, సుడిగేల హనుమంతు, ఏఎంసీ డైరెక్టర్ కూతాటి నరసింహులు, మైదం జోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.