- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నారంలో కారు బీభత్సం.. నలుగురికి గాయాలు
దిశ, పర్వతగిరి: డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు బీభత్సం సృష్టించిన సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం షరీఫ్ గ్రామంలోని తెలంగాణ తల్లి జంక్షన్ సమీపంలో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లింది. ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం: స్థానికులు
కారు ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రతివారం శుక్రవారం రోజున జరిగిన అన్నారం షరీఫ్ దర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అన్నారం దర్గా పరిసర ప్రాంతాలలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఒక్క రోడ్డు మరమత్తులు చేపట్టి.. మరో పక్క వదిలివేశారని అంటున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు జరిగిన ప్రమాదానికి అధికారులు రోడ్డు మరమ్మతులు సరిగా చేయకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.