- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవైపు ఉత్సవాలు.. మరోవైపు ఆందోళనలు
దిశ, కాటారం : రాష్ట్రంలో గ్రామ గ్రామాన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతుండగా అపశృతి నెలకొంది. రైతులు తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రేగుల గూడెం గ్రామం వద్ద కాటారం - మంథని రహదారి పై ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముందు చూపులేని ప్రభుత్వ కేంద్రంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రబీ సీజన్లో ధాన్యం విక్రయించడానికి కాటారం మండలంలో రైతులు తీవ్ర అగచాట్లు, ఇబ్బందులు, ఒకటి కాదు.. ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవిస్తు న్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడానికి మే 24వ తేదీన సంబంధిత కేంద్రాలకు ఉత్తర్వులు ఇవ్వగా సర్క్యులర్ పైన 19వ తేదీ ఉంది.
ఒంగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభించినట్లు అధికారులు చెప్పుకోవడానికి వీలుండగా క్షేత్రస్థాయిలో తీరు మరో రకంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. రేగుల గూడెం కేంద్రంలో ప్రార్ధన కొరత ఏర్పడడంతో ధాన్యం కాంటాలు కావడం లేదని, కాంట అయిన ధాన్యమును రవాణా చేసేందుకు లారీలు దొరకక రైతులు నెలల తరబడి కేంద్రాల్లోనే ఉండాల్సిన వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు ఇచ్చిన వారికే బార్దాను.. ధాన్యం కాంటాలు..?
కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అనుకూలంగా ఉన్న రైతులు లేదా డబ్బులు ఇచ్చి మచ్చిక చేసుకున్న రైతులకే బార్ధానిస్తూ కాంటాలు చేస్తూ ధాన్యం రవాణా చేస్తున్నట్లు కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఏదైనా విషయమై రైతులు ప్రశ్నిస్తే నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నారని ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇదే తంతు జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. రేగుల గూడెం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సుమారు 20 వేల క్వింటాళ్లు కాంట్రా కావాల్సి ఉందని, ఈరోజు ఒకటే లేదా రెండు లారీలు ఇస్తే కనీసం నెల రోజులు గడిచిన ధాన్యం విక్రయాలు ముగిసిపోవని రైతులు వాపోతున్నారు.
దళితుల మనే తమ పట్ల చిన్న చూపు అంటున్న రైతులు
రేగుల గూడెం కొనుగోలు కేంద్రంలో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని కేవలం దళితుల వడ్లు మాత్రమే కాంటా కాకుండా ఉన్నాయని పలువురు రైతులు ఆరోపించారు. అగ్రవర్ణాల రైతులకు ముందుగానే కాంటాలు చేశారని దళితుల వడ్లు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ అణిచివేతకు గురిచేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు దళిత రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అన్ని సంచులు ఇవ్వడంతో పాటు అదనపు లారీలు కేటాయించి ధాన్యం తూకం ను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.