మిల్లర్లు మోసం చేస్తున్నారంటూ రైతుల ఆందోళన (వీడియో)

by Javid Pasha |   ( Updated:2023-04-01 18:03:46.0  )
మిల్లర్లు మోసం చేస్తున్నారంటూ రైతుల ఆందోళన (వీడియో)
X

దిశ, పెద్దవంగర : దళారులు తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల పరిధిలోని చిన్నవంగర శివారులో గల శ్రీ లక్ష్మి వాసవి ఇండస్ట్రీస్ యాజమాన్యం వే బ్రిడ్జి తూకంలో టిక్యా తండాకుచెందిన రైతులు అమ్మకానికి తెచ్చిన పత్తిని తూకం వెయగా 18 క్వింటాల్ రావటంతో అనుమానం వచ్చి కాళీ వాహనం కూడ తూకం వేసి చూసి మరొక వేబ్రిడ్జిలో తూకం వేస్తె 1.20 క్వింటాల తేడా వచ్చిందని బాధిత రైతు తెలిపాడు. వెంటనే వెళ్లి మిల్లు యాజమానిని నిలదీయగా పొరపాటు జరిగిందని, టెక్నీకల్ ప్రాబ్లమ్ అని సదరు మిల్లు యజమాని చెప్పాడు.

దీంతో మిల్లు యజమానికి రైతుకు మధ్య కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది. మిల్లు దగ్గర ఉన్న కాంటాలను అధికారులు పర్యవేక్షించకపోవడం వలన పత్తి మిల్లు దగ్గర మోసాలకు హద్దే లేకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో మోసం చేస్తున్న మిల్లు యజమాని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఇంత వరకు అమ్ముకున్న రైతులకు ఎంత మోసం చేశారో విచారణ చేసి రైతులకు అట్టి డబ్బులు చెల్లించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed