- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ములుగులో ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా
దిశ, ములుగు ప్రతినిధి : ఇన్సూరెన్స్ బీమా అనేది కుటుంబానికి ఒక భరోసా కానీ అనారోగ్యంతో ఉన్న చిన్న, మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్ చేసి వారికి మాయమాటలు చెప్పి ఇన్సూరెన్స్ కట్టి ఆ తర్వాత వచ్చే బీమా సొమ్ములో అసలు నొక్కేసి కొసరుని బాధిత కుటుంబాలకు ముట్ట చెప్పే ముఠా ఒకటి ములుగు జిల్లాలో తిరుగుతోంది. వివిధ మండలాల్లో వీరు తమ కార్యకలాపాలు గుట్టుగా సాగిస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను మోసం చేసి లక్షలలో బీమా డబ్బును కాజేసి కోట్లకు ఎదిగారని, ఇదంతా గుట్టుగా సాగిస్తూ పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వారి చీకటి వ్యాపారాన్ని వెలుగులోకి రాకుండా గుట్టుగా తమ దందాని నడుపుతున్నారని సమాచారం.
కాటికి కాలు చాపిన వారే వీరి టార్గెట్....
ములుగు జిల్లాలో ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా తమ కార్యకలాపాలను చాప కింద నీరులా గుట్టుగా సాగిస్తున్నారు. పేద,మధ్య తరగతి కుటుంబాలు అందులోను ముందు,వెనక ఎవరూ లేని అనారోగ్యానికి గురై రేపో,మాపో చనిపోయే వ్యక్తిని ఎంచుకొని వారి కుటుంబాలతో బీమా సొమ్మును ఇప్పిస్తామని నమ్మ పలుకుతూ మాయ మాటలు చెప్పి సదరు వ్యక్తిపై లక్షల్లో ఇన్సూరెన్స్ చేసి తీరా అనారోగ్యం వల్ల
చనిపోయిన వ్యక్తి బీమా సొమ్మును నామిని అకౌంట్లో పడిన వెంటనే వారి కుటుంబానికి తెలియకుండా మొత్తం సొమ్మును నొక్కేయటం, ఇలా లక్షల్లో బీమా సొమ్మును నొక్కేసి బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, ఇలా ఇప్పటికే జిల్లాలో ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా పాతుకు పోయిందని, జిల్లాలో అక్కడక్కడా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు వినిపిస్తుంది.
ముఠాగా తయారైన ఫేక్ ఇన్సూరెన్స్ కేటుగాళ్లు
శవాలపై పేలాలు ఏరుకునే ముఠా ములుగు జిల్లాలో తయారైందని, గ్రామాల్లో చనిపోయే వ్యక్తులను టార్గెట్ చేసి డబ్బులు సంపాదించే కొందరు వ్యక్తులు ఇదే వ్యాపారంగా చేసుకుని బీమా సొమ్మును లక్షల్లో కాజేసి కోట్లకు పడగెత్తుతున్నారు. మొదట ఇద్దరు, ముగ్గురితో మొదలైన ఈ ముఠా ఇప్పుడు పాతికమంది కంటే ఎక్కువ వ్యక్తులతో చీకటి రాజ్యాన్ని ఏర్పరచుకొని చాప కింద నీరులా విస్తరిస్తుందని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు.
పోలీసుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు
జిల్లా వ్యాప్తంగా ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా చెలరేగిపోతున్నా ఎక్కడా తమ విషయం బయటకు పొక్కకుండా కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముఠా తమ పని తాము చక్క పెట్టుకుంటూ ముఖ్యంగా పోలీసుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త వహిస్తూ
ఎక్కడ ఎలాంటి తేడా రాకుండా ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఎవరైనా తమ బీమా సొమ్ము గురించి నిలదీసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే సందర్భాల్లో తమ చేతుల్లో ఉండే పెద్దమనుషులను రంగంలోకి దింపి బాధిత కుటుంబాన్ని నయానా భయానా ఒప్పించి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా జాగ్రత్త పడుతూ తమ చీకటి వ్యాపారాన్ని బయటకి పొక్కకుండా చూసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
- Tags
- Fake insurance