సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్..

by Aamani |
సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్..
X

దిశ, హనుమకొండ టౌన్ : సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు. రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం చేశారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పోలీస్ లా పహారాలు, నిర్బంధాలు ఎందుకు?, ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ ఆంక్షలు ఎందుకు అని అన్నారు. ఆరు నెలల పాలనకే ఇంత అభద్రతా భావమా అరాచకమా అని ప్రశ్నించారు. మాకు కొట్లాడటం కొత్తకాదు. కానీ, మేం కేవలం నిర్మాణాత్మక సూచనలు, ప్రజల కోనలో విజ్ఞప్తులు మాత్రమే చేశాం అని, ముఖ్యమంత్రి సహా సగం క్యాబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక ప్రయివేటు హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ఏగేసుకొని వస్తున్నప్పటికీ వరంగల్ కు ముఖ్యమంత్రి వస్తున్నాడు అన్న వాతావరణం, ఆ కళే లేదు అన్నారు. నా ప్రెస్ మీట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయి అని, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేదాక సీఎం హోదాలో ఎలా పర్యటించాలో తెలియడం లేదు అని, కేసీఆర్ నిర్మాణ తలపెట్టిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు ఎందుకు జరగడం లేదో స్పష్టం చేయాలి అని అన్నారు. ఉత్తర తెలంగాణ కు పెద్ద దిక్కు, పేదలకు పెద్దాసుపత్రి ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించకుండా కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పోవడం ఏంటి.?, కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుండి తొలగించడం పై సీఎం స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. కాకతీయ కళా తోరణం రాచరిక దర్పం అన్న వ్యాఖ్యలు ఓరుగల్లు మా ప్రజలను తీవ్రంగా బాధించాయి. కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటలు వెనక్కి తీసుకొని, ఓరుగల్లు ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి అన్నారు.

వరంగల్ దాటే లోగా కాకతీయ తోరణం తొలగింపు పై స్పష్టత రావాలి. లేకపోతే, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులంతా రేవంత్ రెడ్డి ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నా చెయ్యాలి అని, లేదంటే మీ క్యాంప్ ఆఫీస్ ల ముందు ప్రజలు కుర్చుకుంటారు అని మాట్లాడారు. కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటాం. కానీ, మా ఆత్మగౌరవం మేధ దెబ్బ తీయాలని చూస్తే ఊరుకోం అని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్న గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను లైబ్రరీలో నిర్బంధించడం దారుణం అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఓట్లు వేస్తే గద్దెనెక్కి ఇప్పుడు వాళ్ళనే తాళం వేసి బంధించడం నీ అవకాశవాదానికి అద్దం పడుతుంది అన్నారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీ ఆర్ ఎస్ వి నాయకులను అరెస్టు చెయ్యడం దారుణం అని, అలాగే పరకాల లో రైతులను నిర్బంధించారు. విద్యార్థులను రైతులను, నిరుద్యోగులను, ప్రజా సంఘాల నాయకులను, విద్యార్థి నాయకులను, ప్రతిపక్ష నాయకులను అందర్నీ నిర్బంధించి పర్యటించడమేనా ప్రజా పాలన అని అన్నారు. అంత భయం ఉన్నప్పుడు పర్యటనలు ఎందుకు వర్చువల్ గా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు గా అని, సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి , రైతులకు, విద్యార్థులకు భేషరతుగా క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో 2 వ డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మండల సురేష్, దేవయ్య, కేయూ నేత కొమురన్న, యాదగిరి, లక్ష్మణ్, అశోక్, గువ్వ రాజేష్, పిన్నింటి విజయ, అన్నమాచారి మొదలైన వారు ఉన్నారు.

Next Story

Most Viewed