- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాసంగి ధాన్యం కొనుగోలుకు సిద్ధంకండి: అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్
దిశ, జనగామ: ఈ యాసంగిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ దేశాయ్ సూచించారు. శుక్రవారం ఆయన ఛాంబర్ లో జిల్లాస్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. ఐకేపీలచే 111, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 89చొప్పున మొత్తం 200 కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని ఆయన చెప్పారు. జిల్లాలో 30 లక్షల 25 వేల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఆయా సెంటర్లలో కావలసిన సౌకర్యాలు, వేయింగ్ మిషన్స్, టార్పాలిన్స్, గన్ని బ్యాగులు, మాయిశ్చర్ మీటర్లు, ప్యాడి క్లీనర్స్ తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచి ఈ యాసంగిలో రెండు లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చునని వ్యవసాయ శాఖ భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లాలోని18 బాయిలర్ రైస్ మిల్లులు ధాన్యం దిగుమతికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీ.రామ్ రెడ్డి, డీసీవో కిరణ్ కుమార్, డీసీఎస్ఓఎం. రోజా రాణి, మార్కెటింగ్ డీఎం. నాగేశ్వర శర్మ, సివిల్ సప్లై డీఎం. సంధ్యారాణి, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.