- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వరి ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే కసిరెడ్డి
దిశ, తలకొండపల్లి : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతులు ఎవరు కూడా తొందరపడి దళారులకు, బయట వ్యక్తులకు అమ్మి మోసపోవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని సోమవారం తలకొండపల్లి, పడకల్, వెల్జాల్ గ్రామాలలో నూతన వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని, రైతులు ఎవ్వరు కూడా అధైర్య పడకూడదని, రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు.
ఆరు గ్యారెంటీ పథకాలను అమల్లో భాగంగా రైతులకు ప్రకటించిన క్వింటాలకు రూ. 500 మద్దతు ధరను అమలులోకి తేవడం ఎంతో శుభసూచకమని ఎమ్మెల్యే కసిరెడ్డి గుర్తు చేశారు. త్వరలో కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు తీసుకువచ్చి ఈ ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనంద నింపుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, అమంగల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాట నరసింహ, జిల్లా నాయకులు మోహన్ రెడ్డి, అంజయ్య గుప్తా, భగవాన్ రెడ్డి, మండల్ నాయకులు జైపాల్ రెడ్డి, అజీజ్, చెన్నకేశవులు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, రమాదేవి జగ్గారెడ్డి ,వేణు రెడ్డి, సురేష్ ,మల్లేష్, హరి మోహన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి రాములు, యాదయ్య, తహసీల్దార్ నాగార్జున, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.