- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dogs : కుక్కల బెడద తీరేదెన్నడో?
దిశ,డోర్నకల్ : పట్టణంలో శునకాల బెడద అధికమైంది.ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తూ.. దైనందిన పనులపై బయటకు వచ్చే.. ఆడుకునే పిల్లలు భయపడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. చికెన్,మటన్ సెంటర్లు,హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కలంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది.దాదాపు గొర్రెల మందల్లా అవి పట్టణంలోని అన్ని వీధుల్లో కనిపిస్తున్నాయి.సోమవారం పందిని వేటాడుతున్న దృశ్యం నెట్టింట వైరల్ అవుతుంది.పందులే కదా అనుకుంటే తర్వాత చిన్న పిల్లల పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పురపాలక పరిధిలో శునకాల సంతతిని నివారించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది.పత్రికల్లో కథనాలు వచ్చినా,ఫిర్యాదులు చేసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని,కుక్కల నియంత్రణకు కృషి చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
- Tags
- Telugu News
- Dogs