- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా..
దిశ, జనగామ: జనగామ నియోజకవర్గం లోని అన్ని రిజర్వాయర్లను నీటితో నింపాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. దాదాపు 20 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నీరు లేక ఎండిపోతున్న రిజర్వాయర్లకు జలకళ తేవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ యూత్ అధ్యక్షులు క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు రైతుల బాధలు పట్టించుకోవడం లో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
బొమ్మకూరు లో నీరు అడగడానికి పోయి బిగించే క్రమంలో యువరైతు రాజు మరణించడం బాధాకరమని మండిపడ్డారు. ఇప్పటికైనా శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రత్యేక చొరవ చూపి వెంటనే రిజర్వాయర్లు నీటిని నింపాలని డిమాండ్ చేశారు. కాగా ఆందోళనకారులను జనగామ పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ ఆందోళనలో బీసీ సెల్ జనగాం మండల అధ్యక్షుడు కూరకుల నాగరాజు, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిమ్మ కరుణాకర్ రెడ్డి, బుర్ర నరేష్ గౌడ్, బత్తిని నిఖిల్ గౌడ్, బల్నే నరేష్ గౌడ్, పౌడి రాజు, గోలకొండ శ్రీనివాస్, ధరావత్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.