తవ్విన కొద్దీ అక్రమాలు..బయటపడుతున్న కార్యదర్శుల అవినీతి లీలలు

by samatah |
తవ్విన కొద్దీ అక్రమాలు..బయటపడుతున్న కార్యదర్శుల అవినీతి లీలలు
X

దిశ, ములుగు ప్రతినిధి: ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తు నిధులు మంజూరు చేసతున్నారు. గ్రామాల రూపురేఖలు మార్చడం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినిధిగా కార్యదర్శులను నియమించగా, ఇదే అదునుగా మంగపేట మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు పంచాయతీ సొమ్మును పక్కదారి పట్టిన్న ఘటన వెలుగు చూసింది.

ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ కార్యదర్శి జీపీ నిధులను పక్కదారి పట్టించడంపై బుధవారం దిశ పత్రికలో కథనం ప్రచురితమైంది. క్షేత్రస్థాయిలో బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నిధుల వ్యవహారం ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సదరు పంచాయతీ కార్యదర్శి వేర్వేరు ఎంటర్​ప్రైజెస్ పేర్లతో బిల్లులు చెల్లించినప్పటికీ అన్నీ కూడా ఒకే బ్యాంక్ అకౌంట్ ఖాతాను కలిగి ఉండడం గమనార్హం. రూ.వేలల్లో చెల్లించే బిల్లులు ఒకే షాపు యజమాని అకౌంట్లోకి పంపించడంపై గ్రామ ప్రజలు విస్మయానికి గురయ్యారు. గ్రామపంచాయతీ నిధులను పక్కదారి పట్టిస్తూ వేర్వేరు పేర్ల మీద ఒకే అకౌంట్ కు నిధులు మళ్లించి తన జేబులోకి తెప్పించుకున్న ప్రయత్నానికి గ్రామ ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఈ తతంగం అంతా ఎన్నాళ్ల నుంచి సాగుతుందో, ఇంకా ఏయే పేర్లపై నిధులను దోచుకుని ఉంటాడో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

సిరి ఎంటర్​ప్రైజెస్ పేరుతో..

బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి కాకుండా మండల కేంద్రానికి చుట్టుపక్కల గల నర్సాయిగూడెం, వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీల కార్యదర్శులు సిరిఎంటర్​ప్రైజెస్ పేరుతో గల ఎలక్ట్రికల్-ఆటో మొబైల్ షాప్ యజమానితో ఒప్పందం కుదుర్చుకుని గ్రామపంచాయతీ నిధులను వివిధ అవసరాల పేరుతో సిరి ఎంటర్​ప్రైజెస్ ఖాతాలోకి రూ.లక్షల్లో మళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నారు. మండలంలోని చాలా గ్రామాల కార్యదర్శులు సిరి ఎంటర్​ప్రైజెస్ యజమానికి వివిధ ఖర్చుల పేరుతో పంచాయతీ నిధులు మళ్లించి ఒప్పందం ప్రకారం పంచుకొని జేబులు నింపుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంగపేట మండలం కేంద్రానికి చుట్టుపక్కల గ్రామపంచాయతీ కార్యదర్శులకు సిరులు కురిపించే వ్యాపారిగా సదరు యజమానిని భావిస్తున్నారు.

నిధుల పక్కదారిపై అధికారుల ఆరా..

బుధవారం మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ నిధులు తప్పుడు బిల్లులతో పక్కదారి పడుతున్నాయని దిశ దినపత్రికలో వెలువడిన కథనానికి జిల్లా యంత్రాంగం గ్రామపంచాయతీ బిల్లులపై ఆరా తీయడం మొదలుపెట్టారు. మంగపేట మండలం ఎంపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ నాగ పద్మజ బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ నిధుల వినియోగం జరిగిన తీరును బిల్లుల చెల్లింపులో ప్రైవేటు వ్యక్తుల హస్తం ఎంత మేరకు ఉందనే విషయాన్ని నిర్ధారించే పనిలో ఉన్నట్టు సమాచారం. మండలంలో నిధులు దుర్వినియోగంపై అధికారులు రంగ ప్రవేశం చేయడంతో అక్రమాలకు పాల్పడిన కార్యదర్శులు బయటికి పొక్కకుండా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed