- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేనేలేదు : చందుపట్ల కీర్తి రెడ్డి
దిశ,శాయంపేట : రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేనేలేదని భూపాలపల్లి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో బీజేపీ ఆఫీస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులు సబ్సిడీ పొందుతున్నారంటే అది కేవలం బీజేపీ పార్టీ వల్లనని 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రైతులను పట్టించుకోలేదని రైతులు రుణమాఫీ వచ్చిందంటేనే రైతులు అప్పులు కూరుకొని పోయినారు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజుల్లో ఏరువులు కొనుక్కుందాం అంటే చెప్పులు లైన్ లో పెట్టి తీసుకునేవారని కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు మద్దతు ధర లేదని కేంద్రంలో బీజేపీ వచ్చినాక పది సంవత్సరాల్లో రైతులకు మద్దతు ధర కల్పించారని ఎరువులు విరివిరిగా దొరుకుతున్నాయని అన్నారు. బీజేపీ పార్టీ దేశం కోసం ధర్మం కోసం ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎస్సీ వర్గీకరణ నినాదంతో అన్ని వర్గాలను కలుపుకుని పోతుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాయంపేట యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More..
'కాంగ్రెస్ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇస్తారా ?'