పంచాయితీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలి.. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

by Sumithra |
పంచాయితీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలి.. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు
X

దిశ, హనుమకొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శులను ఎటువంటి షరతులు లేకుండా పర్మినెంట్ చేసి కార్యదర్శులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పర్వతగిరి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పర్వతగిరి రాజు మాట్లాడుతూ పంచాయితి కార్యదర్శులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి పీఆర్సీ ప్రకటించాలని, గ్రామ పంచాయితీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం నుండి జూనియర్ పంచాయితీ కార్యదర్శుల శాంతియుత నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాట్లు తెలిపారు. గ్రామల్లో అన్ని రకాల సేవలు అందిస్తు ప్రజలకు అందుబాటులో ఉంటున్న గ్రామ పంచాయితీ కార్యదర్శుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

అనేక గ్రామల్లో గ్రామపంచాయితీ కార్యదర్శుల సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి అనేక అవార్డులు వచ్చాయని అన్నారు. గ్రామలకు అవార్డులు రావడానని పంచాయితీ కార్యదర్శుల పని తీరేనని గుర్తు చేసారు. వీరికి పనికితగ్గ ప్రతిఫలం ఇవ్వాలని తక్షణమే వీరితో చర్చలు జరిపి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కార్యదర్శులు అధైర్య పడొద్దని రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యదర్శులను పర్మినెంట్ చేస్తామని భరోసానిచ్చారు. పాక్స్ చైర్మన్ ఏరుగొండ రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుల సుదర్శన్, ఓబీసీ జిల్లా కోఆర్డినేటర్ చిమ్మని దేవరాజు, మత్స్య శాఖ సొసైటీ చైర్మన్ బయ్యా తిరుపతి, డైరెక్టర్ జయపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పరికిరాల వాసు, కుమారస్వామి, కడబోయిన రవి యాదవ్ , తనుగుల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story