- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బల్దియా చుట్టూ బొంగరంలా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు
దిశ, వరంగల్ టౌన్ : పలుకుబడి ఉంటే చాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి పనులైనా క్షణాల్లో జరుగుతుంటాయని అందరూ అంటుంటారు. అంతేకాదు, పలుకుబడి కలిగిన వారికి అధికారులు అండగా నిలబడతారని కూడా చెబుతుంటారు. అందుకు వరంగల్ మహా నగర పాలక సంస్థ నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి తన కాలనీలో ఒకరు రోడ్డును ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టాడని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులకు రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ ఫిర్యాదును పక్కన పెట్టిన అధికారులు ఫిర్యాదుదారుడి పైనే చర్యలు తీసుకోవడం ఆశ్చర్యంనకు గురి చేస్తోంది.
అసలు ఏం జరిగిందంటే..
వరంగల్ రంగశాయిపేటలో జింజిరాల అమర్నాథ్ ఒక ప్లాట్ కొనుగోలు చేసి.. 2000 సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాడు. కుటుంబసభ్యులతో నివసిస్తున్నాడు. ఈ ఇంటికి తూర్పు 20 ఫీట్ల దారి, పడమర దిక్కు 30 ఫీట్ల రోడ్డు పేర్కొంటూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉంది. ఆ ప్రకారమే తను కొనుగోలు చేసిన 139 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పొరుగున ఉన్న కానిస్టేబుల్ చెన్కూరి దేవేందర్ తో వివాదం మొదలైంది. అమర్నాథ్ ఇంటికి పడమర భాగంలో గల కొద్దిపాటి స్థలంలో ఈ కానిస్టేబుల్ ఇల్లు కట్టుకుంటాడు. అమర్నాథ్ ఇంటికి పడమర దిక్కులో గల 30 ఫీట్ల రోడ్డు చివరే కానిస్టేబుల్ ఇల్లు.
ఇక్కడే ఇద్దరి మధ్య వివాదం..
అమర్నాథ్ కు ఈ ఫీట్ల రోడ్డుతో సంబంధం లేదు అనేది కానిస్టేబుల్ దేవేందర్ వాదన. అయితే తనకు అమ్మిన ప్లాట్ యజమాని ఈ రోడ్డు కూడా తనకు వర్తిస్తుందని చెప్పినట్లు, ఆ ప్రకారమే తన డాక్యుమెంట్ లో కూడా పేర్కొని ఉందంటూ అమర్నాథ్ ఆవేదన. ఈ విషయం వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఒక సందర్భంలో అమర్నాథ్ భార్యపై కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు భౌతిక దాడి చేసి గాయపరుస్తారు. ఈ ఘటన పై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ అమర్నాథ్ పై మరింత కక్ష పెంచుకున్నాడో ఏమో తన పలుకుబడితో అమర్నాథ్ ఇంటి మెట్లు బల్దియా అధికారులతో కూల్చి వేయిస్తాడు. మ్యాప్ ప్రకారం వీరి ఇంటి వద్ద రోడ్డు 30 ఫీట్లు లేదు. ఆ కారణం చెబుతూ అమర్నాథ్ ఇంటి కాంపౌండ్ వాల్ ను కూలగొడతారు.
అమర్నాథ్ ఆవేదన..
అసలు ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ కూడా 30 ఫీట్లు లేదని, మరి తన ఇంటి వద్దే లేదంటూ మార్కింగ్ చేయడంపై మున్సిపల్ అధికారులను అమర్నాథ్ ప్రశ్నించిన ఫలితం శూన్యం.