- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Complaint : పలు చెరువుల విధ్వంసంపై వరుస ఫిర్యాదులు.!

దిశ,మరిపెడ: ఈ సుంట రమ్మంటే ఇల్లంతా నాదే అనే చందంగా సదరు శ్రీ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్ట్ సంస్థ పనితీరు ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ చెరువుల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు జరుపుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని ఇరిగేషన్ శాఖకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి.జిల్లాలోని మాదాపురం గ్రామ రైతుల ఫిర్యాదు మరువకముందే నిబంధనలు అతిక్రమించి చిన్నగూడూరు మండలకేంద్రంలోని శక్తి చెరువు( ముత్యాలమ్మ కుంట) నుండి ఇష్ట రీతిన మట్టి తవ్వకాలు జరిగిన తీరుపై ఆ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెరువులోని మట్టిని తరలించడం తో భారీ గుంతలు ఏర్పడడంతో వచ్చిన వర్షం నీరు తూముల లో నుండి కిందకు రాకుండా ఆ గుంతలలోని నిల్వ ఉంటున్నాయని నీరందక చెరువు కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదని తక్షణమే న్యాయం చేయాలంటూ మానుకోట ఈ ఈ సమ్మిరెడ్డి కి ఫిర్యాదు అందజేశారు.ఇదే కోవలో ఫిర్యాదు చేసేందుకు మరి కొన్ని గ్రామాల రైతులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.