- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
బాలికల హాస్టల్లో కుప్పకూలిన స్లాబ్.. ఆందోళన చెందుతోన్న విద్యార్థులు
దిశ, వెబ్డెస్క్: బాలికల హాస్టల్లో స్లాబ్ కుప్పకూలిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్ అర్ధరాత్రి స్లాబ్ కుప్పకూలడంతో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో గదిలో ఎవరూ లేర కాబట్టి తమ ప్రాణాలకు ప్రమాదం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే ఎంతమంది ప్రాణాలకు హాని జరిగుండేది అంటూ యజమాన్యాన్ని విద్యార్థులు నిలదీస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఫ్యాన్ కిందపడి విద్యార్థికి గాయాలయ్యాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ యాజమాన్యాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యులా? మిమ్మల్ని నమ్మి పంపిన మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పటికి ఎన్నో ఘటనలు జరిగినా పెడచెవిన పెడుతున్నారు అంటూ కాకతీయ యూనివర్సీటీ పోతన బాలికల హాస్టల్ అమ్మాయిలు ఆందోళన చేపడుతున్నారు.