Happy Birthday Ponguleti :మంత్రి పొంగులేటికి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్

by Bhoopathi Nagaiah |
Happy Birthday Ponguleti :మంత్రి పొంగులేటికి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మొక్కను బహూకరించారు. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండునూరేళ్లు జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరి వెళ్లారు.

కాగా, పొంగులేటి జన్మదినం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఊరువాడల్లో కేకులు కట్ చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెడుతున్నారు. యువతకు క్రీడాపోటీలు పెడుతున్నారు. ఆలయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరిట ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నేడు పండుగ వాతావరణాన్ని తలపించేలా కాంగ్రెస్ శేణులు సంబురాలు చేసుకుంటున్నారు.

Advertisement

Next Story