అప్పులు ఇస్తామంటూ చైన్‌స్నాచింగ్.. ఇలాంటి వారితో బీ కేర్‌ఫుల్

by Sumithra |
అప్పులు ఇస్తామంటూ చైన్‌స్నాచింగ్.. ఇలాంటి వారితో బీ కేర్‌ఫుల్
X

దిశ, హనుమకొండ టౌన్: ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన చుంచు అలియాస్( గుగులోత్ స్వప్న) హన్మకొండలోని నక్కలగుట్టలో ఉంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లకుంట గ్రామానికి చెందిన ఏటికాల సురేందర్ హన్మకొండలోని వడ్డేపల్లి వద్ద ఉంటున్నాడు. వీరు 80 ఏళ్ల వయస్సు ఉన్న రామంచ కొమురమ్మకు అప్పు ఇప్పిస్తామంటూ ట్రాప్ చేసి బాలసముద్రం ప్రాంతానికి తీసుకెళ్లారు. ఫోటో తీస్తున్నప్పుడు ఆమె బంగారు గొలుసును తీసివేయమని చెప్పగా.. ఆమె తీసింది. దీంతో వారు బంగారు గొలుసుతో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ జీ తెలిపారు.

ప్రజలకు గమనిక..

తెలియని వ్యక్తుల మాటలకు లొంగవద్దని ప్రజలను అభ్యర్థించారు. వారు మీ ప్రాణాలకు, ఆస్తికి హాని కలిగించవచ్చని, ఇలాంటి అనేక బృందాలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని హనుమకొండ పోలీస్ స్టేషన్ సిహెచ్. శ్రీనివాస్ జీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed