బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అందుకే కుల గణన : మంత్రి పొన్నం

by Aamani |
బలహీన వర్గాలకు  ప్రాతినిధ్యం కల్పించే అందుకే  కుల గణన : మంత్రి పొన్నం
X

దిశ,లింగాల గణపురం : బడుగు బలహీన వర్గాలకు జన దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించే అందుకే ప్రభుత్వం కుల గణన చేపట్టనుందని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గౌడ కులస్తులు ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కు ముఖ్య అతిథిగా హజరైయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసిందని, కామారెడ్డి డిక్లేషన్ ప్రకారం రిజర్వేషన్లకు కోర్టు తీర్పు ఉందని కులగన అయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సర్వాయి పాపన్న చరిత్రను ఇన్ని రోజులు కప్పిపుచ్చారని, మనలో చైతన్యం వచ్చాకే ఔరంగజేబ్ లాంటి ఎంతో మందిని ఎదిరించి పోరాడిన పాపన్న చరిత్రను, మన వారసత్వాన్ని తెలియజేయగలుగుతున్నామన్నారు.

నియంతత్వ పాలను రూపుమాపడం కోసం, సొంత సైన్యాన్ని తయారు చేసి పోరాడిన వీర యోధుడు సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం చేశారన్నారు. ఇందుకోసం శాసనసభ్యులమంత కలిసి జీవో రూపంలో తీసుకువచ్చి అమలు అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్ఐటి సృష్టించిన కాటమయ్య కవచం గౌడన్న లకు సంజీవిని లాంటిది అన్నారు. రెండు సంవత్సరాల్లో ప్రతి గౌడ కు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కవచం గౌడ్ అన్నకు ప్రాణహాని కలగకుండా కాపాడు తుందన్నారు. స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లో కూడా సాంకేతికకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి కుల వృత్తులను అభివృద్ధి చేస్తామన్నారు. గౌడ్ అన్నలు వృత్తినే కాకుండా తమ పిల్లలను కూడా బాగా చదివించాలన్నారు.

చరిత్ర సర్వాయి పాపన్నను చిన్నచూపు చూసింది : ఎమ్మెల్యే కడియం

సర్వాయి పాపన్న గౌడ కులంలో పుట్టాడు కాబట్టే, చరిత్ర, చరిత్ర కార్లు చిన్నచూపు చూశారన్నారు. ఆయన చేసిన దండయాత్ర గురించి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు, ఆయన నడిపిన ఉద్యమాల గురించి ఎవరు గొప్పగా చెప్పలేదు. అదే అగ్ర కులంలో పుట్టి ఉంటే ఆ నాయకుని చరిత్ర గొప్పగా చెప్పే వారన్నారు. బడుగు బలహీన వర్గాల్లో పుట్టాడు కాబట్టే సర్వాయి పాపన్న చరిత్ర మనకు గతంలో తెలియ అన్నారు. ఇప్పుడు మనం మేల్కొని అతని సాహసాలను తెలుసుకోగలుగుతున్నామన్నారు. సర్వాయి పాపన్న మన జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అన్నారు. జనగామ అంటేనే పోరాటాల గడ్డ అని ఆ పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

పాపన్న చరిత్ర స్ఫూర్తిదాయకం : ఎంపీ కావ్య

సర్వాయి పాపన్న ఒక సొంత సైన్యాన్ని తయారు చేసి ఔరంగజేబ్,ఢిల్లీ సుల్తాన్ లపై పోరాడిన యోధుడు అన్నారు. ఆయన చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులకు కాటమయ్య కిట్ అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు దూసరి గణపతి, బోయిని రాజు శిరీష, తీగల సిద్దు, గుర్రం బాలరాజు, ఎడ్ల రాజు, బస్వా గాని ఉపేందర్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు,కాంటెస్ట్ జడ్పీటీసీ పోరెడ్డి మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరి శివ, గీత కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed