జీఓ 28 ప్రతులు దహనం

by Sridhar Babu |
జీఓ 28 ప్రతులు దహనం
X

దిశ, జనగామ : జీఓ 28 ప్రతులు దహనం చేసి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఆగస్టు 23న ఉద్యోగుల పెన్షన్ విద్రోహదినంగా పాటించారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తాటికొండ జెడ్పీహెచ్​స్​లో నిర్వహించిన నిరసనలో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. లింగమూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల జీవితాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు వారి

జీతాలలో కోత విధించి ఆ డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టి జూదం ఆడటం సిగ్గుచేటు అన్నారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు కె. లక్ష్మణమూర్తి, ప్రధానోపాధ్యాయులు రాజేందర్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed