కుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ : దాస్యం వినయ్ భాస్కర్

by Aamani |   ( Updated:2023-11-26 14:49:18.0  )
కుల సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ : దాస్యం వినయ్ భాస్కర్
X

దిశ, హనుమకొండ టౌన్ : బాలసముద్రం లో హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖత్రి మిత్రమండలి, ఎస్ ఎస్ కే సమాజ్ వారి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టంకు ప్రసాద్ సా సభా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో భారీ సంఖ్యలో కుల సంఘాలు మద్దతు తెలపడం సంతోషకరమని, అదే విధంగా ఖత్రి మిత్రమండలి మద్దతు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు. చాలా సందర్భాల్లో కలిసామని,అనేక సమస్యలు నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించానని అన్నారు. మీతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఇప్పటిది కాదని,ఎల్లప్పుడూ మీలో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా,తమ్ముడిగా, కొడుకు గా ఉండి పని చేస్తానని అన్నారు.

చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి మీకు నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని, అదే విధంగా సంక్షేమ పథకాల్లో కూడా అవకాశాలు కల్పిస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలాన్ని, భవన నిర్మాణం కోసం నిధులను కూడా కేటాయిస్తానని అన్నారు.ఈనెల 30వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఓటింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులను కూడా పాల్గొనేలా చేసి ప్రతి ఒక్కరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, సీనియర్ నాయకులు కోరబోయిన సాంబయ్య, మర్రి జనార్దన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story