అన్న పై తమ్ముడి దాడి..!

by Kalyani |
అన్న పై తమ్ముడి దాడి..!
X

దిశ, నర్సంపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేసి గాయపరిచిన సంఘటన నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన బుర్ర వెంకటేశ్వర్లు,శ్యామ్ సుందర్ అన్నదమ్ములు. వీరి ఇరువురి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పెన్షన్ డబ్బుల కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేశ్వర్లను అతని ఇంటి దగ్గరలో తమ్ముడు అడ్డుకున్నారు. కర్రతో తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు తలపై తీవ్ర గాయం అయింది. స్పందించిన స్థానికులు హుటాహుటిన వెంకటేశ్వర్లును ఆటోలో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వర్లును ప్రాథమిక చికిత్స అందించి వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం బాధితుడు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. బాధితుడి కుమారుడు శ్రవణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed