- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు..
దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్, టీజిఓస్, ట్రెస్సా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్, పౌరసరఫరాలు, పంచాయతీ రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, తదితర శాఖల మహిళా ఉద్యోగులు, తీరొక్క పూలతో పేర్చిన భారీ బతుకమ్మలతో కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. బతుకమ్మల చుట్టూ మహిళా ఉద్యోగులు చేరి బతుకమ్మ పాటలకు కోలాటం వేస్తూ నృత్యాలతో సందడి చేశారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులు బతుకమ్మ పాటలను ఆలపించి ఉత్సహాన్ని రెట్టింపు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లా కలెక్టరేట్లో టీఎన్జీవోస్,టిజీవోస్, ట్రెస్సా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించడం చాలా సంతోషకరం గా ఉందన్నారు. బతుకమ్మ వేడుకలను నిర్వహించడం పట్ల ఆయా సంఘాల నాయకులకు అభినందనలు తెలియజేశారు. సమావేశం అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, తదితరులకు జ్ఞాపికలను అందించి శాలువాలతో సన్మానించారు.
వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు తీసుకొచ్చిన బతుకమ్మలను ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తిలకించారు. మహిళ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. పలు శాఖల మహిళా ఉద్యోగులు తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమంగా నిలిచిన బతుకమ్మ లకు బహుమతులను ప్రధానం చేశారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ సభాధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈవో విద్యా లత, డిఆర్డిఓ నాగ పద్మజ, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు భాస్కర్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సోమయ్య, నాలుగు తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్య నాయక్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.