- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రామప్ప ఉప ఆలయం గుడి పైకప్పు ధ్వంసం కేసులో నిందితుల అరెస్టు
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప ఉప ఆలయమైన గొల్లాల గుడి పై కప్పు ధ్వంసం చేసిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో గుప్తనిధుల కోసం రామప్ప ఉప ఆలయం అయిన గొల్లాల గుడి పైకప్పు ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం పై సెప్టెంబర్ 22న పురావస్తు శాఖ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) అధికారి చెన్నబోయిన కుమారస్వామి ఫిర్యాదు మేరకు వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నలుగురు నిందితులు జాగిరి నరేష్,పులి గౌతమ్,నలుబోతుల ఎర్రయ్య బయ్యారం గ్రామానికి చెందినవారు, రాయబారు ఆగయ్య, గుర్రంపేట గ్రామానికి చెందినవారుగా గుర్తించి బుధవారం వెంకటాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి ములుగు కోర్టులో హాజరు పరిచారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. రామప్ప ఉపాలయాల ధ్వంసం కేసులో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.