- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిజిటల్ బార్ కోడ్ ద్వారా పన్నులు చెల్లించండి..
by Sumithra |
X
దిశ, వరంగల్ టౌన్ : డిజిటల్ బార్ కోడ్ ద్వారా పన్నులు చెల్లించే సదావకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేసి ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లించే సౌకర్యాన్ని మహా నగరపాలక సంస్థ తీసుకువచ్చారన్నారు. ఇందుకు సంబంధించి నగర వాసులకు డిజిటల్ డిమాండ్ నోటీసులను అందజేశారని తెలిపారు.
వీటి పైన ఇంటి, నల్లా పన్నుల చెల్లింపు సంబంధ బార్ కోడ్ లు ముద్రించి ఉంటాయన్నారు. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఇంటి వద్ద నుండే బిల్లులు చెల్లించవచ్చునని, నగర పరిధిలోని ఇంటి యాజమాన్యాలు ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని సులువుగా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ కోరారు.
Advertisement
Next Story