- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి...
దిశ, ములుగు ప్రతినిధి : శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వై.వి.గణేష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరికా గోవిందనాయక్ డీఆర్వో రమాదేవిలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తన కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా సంఘసంస్కర్తగా మహామేధావిగా విఖ్యాతుడిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుగాంచారని భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడని అంటరాని తనంపై ఎక్కుపెట్టి పదునైన ఆయుధంలా ప్రతిక్షణాన్ని ప్రతిసందర్భాన్ని విశ్లేషిస్తూ అన్యాయాన్ని ప్రశ్నించడం సమానత్వం కోసం పోరాడడం చేసిన గొప్పవ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కొనియాడారు.