- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ శ్రేణులంతా సమన్వయంతో పని చేయండి: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
దిశ, రేగొండ: బీఆర్‌ఎస్ శ్రేణులంతా సమన్వయంతో పని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు. శ్రుతి మించుతున్న బీజేపీ దుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్ధ్యాలు ప్రత్యర్థులకు ఏ మాత్రం లేవని పేర్కొన్నారు.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అంకం రాజేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, జడ్పీటీసీ సాయిని విజయ, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, వైస్ ఎంపీపీ ఉమ విద్యాసాగర్ రెడ్డి, కొడవటంచ ఆలయ కమిటీ చైర్మన్ అనిత కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.