- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నారం షరీఫ్‌లో అదనపు దందా.. పట్టించుకోని వక్ఫ్ బోర్డు ఇన్ స్పెక్టర్
దిశ, వర్థన్నపేట: దక్షిణాది భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అన్నారం దర్గా షరీఫ్ కు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గతంలో అన్నారం దర్గాలో ప్రతి శుక్రవారం మాత్రమే పండుగ వాతావరణం నెలకొనేది. ప్రస్తుత రోజుల్లో ప్రతి శుక్రవారం, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మిగతా రోజుల్లో అంతగా లేకపోయినప్పటికీ భక్తులు మొక్కలు తీర్చుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది వస్తుంటారు. అయితే టెండర్ నిర్వాహకులు భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఇన్ స్పెక్టర్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కు కావడంతో వీరి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది.
అదనపు వసూళ్లు దందా..
అన్నారం షరీఫ్ కు వచ్చే భక్తులు ఎక్కువ మొత్తంలో మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు. వీటిని ఆసరాగా చేసుకున్న టెండర్ నిర్వాహకులు యాట కందూరుకు చిట్టి రూ.300 పోను అదనంగా 1000 నుంచి 1500 రుపాయల వరకు వసూళ్లు చేస్తున్నారు. కోడి కందూరుకు చిట్టి రూ.100పోను అదనంగా 500 నుంచి 700 రుపాయలు వసూళ్లు చేసి జేబులు నింపుకుంటున్నారు. భక్తుల అదనపు డబ్బులు ఇవ్వకుండా వసూళ్లను నిలదిస్తే మొక్కుబడి సామగ్రిని భక్తులు నుంచి బలవంతంగా లాక్కోని పక్కకు పెడుతున్నారు.
యాట తల మాంసంతో పాటు డబ్బులు డిమాండ్
భక్తితో మొక్కు తీర్చుకోవడం కందూరు చేసిన భక్తుల నుంచి యాట తల మాంసంతో పాటు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భక్తుల నుంచి తీసుకున్న యాట తల మాంసంను తిరిగి 1200 నుంచి 1500లకు అమ్ముతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం భక్తుల నుంచి సేకరించిన మాంసాన్ని 600 నుంచి 700 రుపాయలకు అమ్ముకోవాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇష్టారీతిన స్వంత రేట్లను నిర్ణయించి భక్తులకు అమ్ముతున్నారు.
వసూళ్లను అడ్డుకున్న గ్రామస్థులు..
అన్నారం షరీఫ్ లో భక్తులను నుంచి కాంట్రాక్టర్ పరిమితికి మించి వసూళ్లకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు అడ్డుకొని కొన్నిరోజులు భక్తులకు ఉపశమనం కలిగించారు. గ్రామస్తుల దర్గా ఆవరణలో గతంలో అక్రమ వసూళ్లకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్ లను పొందుపర్చారు. అప్పుడు గ్రామస్తులు వసూళ్ల విషయంలో కాంట్రాక్టర్ తో గొడవ పడ్డారు. ఇవన్ని జరిగినప్పటికీ వసూళ్ల దందా యథావిధిగా కొనసాగుతుండటం గమనార్హం.
కొబ్బరి కాయ కొట్టినందుకు రూ.10..
భక్తులు ఇష్టం కొద్ది కొట్టె కొబ్బరి కాయల వద్ద కూడా భక్తులను దోపిడీ చేస్తున్నారు. భక్తులు 20 రుపాయలు చెల్లించి కొనుగోలు చేసిన కొబ్బరి కాయకు చిట్టి రూపంలో రూ.5 వసూలు పోను అదనంగా కొబ్బరి కాయ కొట్టినందుకు 10 రుపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. కొబ్బరి కాయలకు సెపరేటు టెండర్ వేసి ఈ వసూళ్లకు పాల్పడుతుండటం గమనార్హం.
వక్ఫ బోర్డు ఇన్ స్పెక్టర్ కనుసన్నల్లో దోపిడీ..
భక్తుల నుంచి అధిక వసూళ్లకు కాంట్రాక్టర్ పాల్పడితే వక్ఫ్ బోర్డు ఇన్ స్పెక్టర్ రేట్లను అదుపులో ఉంచి భక్తులకు ఇబ్బంది కలగకుండా చుడాలి. అయితే సదరు ఇన్ స్పెక్టర్ కాంట్రాక్టర్ తో కుమ్మకై ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు. అధీక వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు ఎవరైనా ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.