షెడ్ వెల్ టైల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..

by Kalyani |   ( Updated:2023-04-22 12:54:55.0  )
షెడ్ వెల్ టైల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం మండలం నామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లందు, మహబూబాబాద్ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న షెడ్ వెల్ పెంకుల ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షెడ్డుకు నిప్పంటుకొని అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు.

ప్రమాద సంఘటన సమయంలో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా చాలా ఆలస్యంగా ప్రమాద ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ లు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ప్రమాద ఘటనపై ఎంతో ఆస్తినష్టం సంభవించిందో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story