- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీపీసీసీ చీఫ్ Revanth Reddy పై కేసు నమోదు
దిశ,మహబూబాబాద్ ప్రతినిధి : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మానుకోట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గూడూరు మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామన్న నాయక్ ఈ నెల 8వ తేదీన మహబూబాబాద్ సెంటర్ లో నిలబడి ఉండగా అప్పుడే ఇదే ప్రాంగణంలో హాత్ సే హత్ జోడో యాత్ర లో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దీంతో పాటు నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. శంకర్ నాయక్ అనుచరులను తొక్కి చంపిస్తా అని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొనట్లు తెలిపారు. గిరిజన ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ, చీఫ్ రేవంత్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సతీష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ఛార్జీలు రద్దు: TPCC చీఫ్ రేవంత్ కీలక హామీ