- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
8 కిలోల గంజాయి పట్టివేత
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో 8 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో భద్రాచలం నుండి ములుగుకు ఇద్దరు గంజాయి సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ములుగు ఎస్సై సిహెచ్ వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది బస్టాండ్ ఆవరణలో తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా సంచితో వస్తున్నట్లు గమనించి వారిని తనిఖీ చేయగా సంచిలో 8 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని విచారించగా నిందితులు ముర్రె రామకృష్ణ( 24) మరొక నిందితుడు భూదాల మురళి ( 26) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా తేలింది. వీరు తరలిస్తున్న గంజాయి విలువ సుమారు1,92,250గా ఉన్నట్లు అంచనా వేసిన పోలీసులు నిందితులపై మారకద్రవ్యాల సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.