- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెంబర్ ప్లేట్స్ లేని 348 వాహనాలు సీజ్..
దిశ, హన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్నా 348 వాహనాలను సీజ్ చేసి వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లు సోమవారం వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రైసిటీ పరిధితో పాటు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగా రిజిస్ట్రేషన్ లేని, మార్ఫింగ్ చేసిన నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, నంబర్ ప్లేట్లకు మాస్కులు పెట్టిన వాహనాలను గుర్తించి వాహన యజమానులపై చీటింగ్ నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు జనవరి 1వ తేదీ నుంచి సోమవారం వరకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా రోజువారి తనిఖీలు ర్వహించడం జరిగిందన్నారు.
అందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 348 వాహనాలు సీజ్ చేయగా ఇందులో కార్లు 4, ఆటోలు ఒకటి, ద్విచక్రవాహనాలు 343, ఈ సీజ్ చేసిన వాహనాల్లో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 93, హనుమకొండ 126, కాజీపేట 72 వాహనాలు ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించడం జరిగిందన్నారు. అప్పగించిన వాహన యజమానులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులను నమోదు చేయడం జరిగిందని ఏసీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు ఈ బాబులాల్, రామకృష్ణ, వరంగల్ ట్రాఫిక్ ఎస్ఐలు రాజబాబు, డేవిడ్, మీల్స్ కాలనీ ఎస్ఐ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.