- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండా సురేఖపై ఢిల్లీకి ఫిర్యాదు చేయనున్న వరంగల్ నేతలు?
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కాంగ్రెస్‌కి చెందిన కీలక నేతలు రేపు (గురువారం) ఢిల్లీకి పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలవనున్నారు. ఈ క్రమంలోనే వాళ్లంతా కొండా సురేఖపై ఫిర్యాదు చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పటికే కొండా వర్గం తమను ఇబ్బంది పెడుతోందంటూ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిపాదాస్ మున్షికి కూడా ఫిర్యాదు చేశారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏకంగా ఢిల్లీకి వరంగల్ నేతలు పయనం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో కొండా సురేఖ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. మొదట నాగార్జున, కేటీఆర్‌లపై చేసిన కామెంట్స్ వల్ల ఆమెపై పరువు నష్టం దావా కేసులు పడ్డాయి. దీంతో పార్టీ కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇక తాజాగా ధర్మారంలో రేగిన పార్టీ ఫ్లెక్సీ గొడవతో కొండా సురేఖపై వ్యతిరేకత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇదే వివాదం నేపథ్యంలో ఆమె నేరుగా వెళ్లి సీఐ సీట్లో కూర్చోవడం కూడా వివాదాలకు కారణమైంది.