కాంగ్రెస్‌కే ఓటు వేయండి.. పార్లమెంట్ ఎన్నికల వేళ KTR సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-09 16:08:50.0  )
కాంగ్రెస్‌కే ఓటు వేయండి.. పార్లమెంట్ ఎన్నికల వేళ KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఓ ఆంగ్ల మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 24 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తాము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశామని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ ప్రాథమిక లక్ష్యమని దాన్ని పార్టీ సాధించిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్టేట్‌ను పాలించే గోల్డెన్ చాన్స్ తమకు వచ్చిందన్నారు. మేము పాలనలో బెస్ట్ ఇచ్చామని.. కొంత మంది పార్టీని వీడితే మరికొంత మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

అయినా ఇదంతా పాలిటిక్స్‌లో కామన్ అన్నారు. ఇప్పటికి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న పార్టీ టీఆర్ఎస్ - బీఆర్ఎస్సే అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వంద రోజుల అబద్ధానికి పదేళ్ల నిజానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నారు. డిసెంబర్ 9 న రూ.2లక్షల రుణమాఫీ అన్నారని.. రుణమాఫీ పథకం పొందిన వారు కాంగ్రెస్‌కు ఓటు వేయ్యాలని.. కానీ వారు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేశారు. నెలకు రూ.2500 మహిళలకు ఇస్తామన్నారని.. ఇప్పటికే ఈ స్కీం పొందిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని లేని వారు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు.

Also Read..

నోరు అదుపులో పెట్టుకుంటే మేలు జరుగుతుంది.. ఉగాది వేళ KTR కు పంచాంగ కర్త స్వీట్ వార్నింగ్ (వీడియో)

Advertisement

Next Story

Most Viewed