ప్లీజ్ ఓటు వేయడానికి రండి.. పాతబస్తీలో ఇంటింటి తలుపుతట్టి ఓటు వేయాలని అభ్యర్థన

by Prasad Jukanti |   ( Updated:2024-05-13 20:41:14.0  )
ప్లీజ్ ఓటు వేయడానికి రండి.. పాతబస్తీలో ఇంటింటి తలుపుతట్టి ఓటు వేయాలని అభ్యర్థన
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో పార్లమెంట్ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లకు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 40.38 శాతం పోలింగ్ కాగా రాష్ట్ర రాజధాని ఓటర్లు ఓటు వేసేందుకు గడపదాటడం లేదు. ఒంటి గంట వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదు అవుతుంటే హైదరాబాద్ లో మాత్రం ఇంకా 20 శాతం పోలింగ్ కూడా దాటలేదు. ఇక్కడ 19.37 శాతం పోలింగ్ నమోదు అయింది. దీంతో ఓటింగ్ శాతం పెంచేందుకు పాతబస్తీలో కొంత మంది యువకులు ఇంటింటి తలుపులు తట్టి ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా హైదరాబాద్ లో ఓటింగ్ పర్సంటేజ్ మందకొడిగా సాగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక మంది ఏపీ సెటిలర్లు, తెలంగాణకు చెందిన వారి ఓట్లు చాలా వరకు డూప్లికేట్స్ ఉన్నాయని ఇప్పుడు వారంతా స్వగ్రామాల్లో ఓట్లు వేయడానికి వెళ్లిపోవడంతో ఇక్కడ పోలింగ్ సంఖ్యపై ఎఫెక్ట్ చూపుతోందనే చర్చ జరుగుతోంది. మరి ఈ పరిస్థితిపై ఎన్నికల సంఘం ఎలాంటి ప్రకటన చేయబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story