- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'చీకటి ' మిత్రులు ' వెలుగు ' లోకి వచ్చారు.. పొత్తుపై విశారదన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు బీఆర్ఎస్, బీఎస్పీ అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌తో ఆర్ఎస్‌ఎస్పీ పొత్తుపెట్టుకోవడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదన్ మహారాజ్ మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్ఎస్పీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘'చీకటి ' మిత్రులు ' వెలుగు ' లోకి వచ్చారు. అదేనండీ "ఆర్ఎస్పీ- కేసీఆర్ పొత్తు". అంటే, ఇన్నాళ్లు ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్‌పై చేసిన యుద్ధం ఒక పెద్ద బూటకం, నాటకం, పచ్చి బోగస్ అని తేలిపోయింది. అసలు రహస్యం బద్ధలైపోయింది. బహుజన వర్గాలకు ఒక స్పష్టత వచ్చింది.’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
విశారదన్ వేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ శ్రేణులు విశారదన్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. దివంగత నేత కాన్షీరామ్ సిద్ధాంతాలు తెలిసి ఉంటే ఇలా మాట్లాడేవాళ్లు కాదని, గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాన్షిరామ్ పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. కాగా, బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కూడా స్పందించారు. కరెక్ట్ స్టెప్ తీసుకోలేదని ఆర్ఎస్పీని విమర్శించారు.