- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం.. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, సంపద పెంచుతూ పేదలకు పథకాల రూపంలో అన్ని వర్గాలకు ఆర్థిక లబ్ధిని చేకూరుస్తూ సీఎం ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణా సంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమేనని అన్నారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా దివ్యాంగులకు ఇప్పటికే ఇస్తున్న 3,016 పెన్షన్ మొత్తాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచి 4,016 రూపాయలు చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరో వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్థిక భరోసా అందిస్తున్నారన్నారు. పెరిగిన ఆసరా పెన్షన్ తో 5.11 లక్షల మంది లబ్ధి దారులకు లబ్ది చేకూరనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై 200కోట్లకు పైగా భారంపడినా పెన్షన్ పెంపు హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు మున్నా, గుత్తికొండ కిరణ్, నల్గొండ శ్రీనివాస్, సుమన్, రాజ్యలక్ష్మి, కోమురెల్లి, వేణు, నాగరాజు, మనీ, తదితరులు పాల్గొన్నారు.