ఈటల vs రేవంత్.. బీఆర్ఎస్‌కు షాకిచ్చేలా ఇద్దరికీ విజయశాంతి అడ్వైస్!

by GSrikanth |
ఈటల vs రేవంత్.. బీఆర్ఎస్‌కు షాకిచ్చేలా ఇద్దరికీ విజయశాంతి అడ్వైస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వేదికగా సవాళ్ల పర్వం నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఫండింగ్ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై టీపీసీసీ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈటల తమ పార్టీపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చేయాలని రేవంత్ కౌంటర్ ఇవ్వడంతో ఈటల వర్సెస్ రేవంత్ మధ్య రాజకీయం వేడెక్కింది. ఈ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి పరోక్షంగా చురకలు అంటించారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఈ ఇద్దరు తమ్ముళ్లు.. బీఆర్ఎస్‌పై పోరాటం చేయకుండా ఇలా పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం బీఆర్ఎస్‌కు వేడుకగా మారుతుందని అన్నారు.

ఈ సందర్భంలో ఈ ఇద్దరు నేతలు కొంచెం ఆలోచించాలని ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే బదులు ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాటం చేయడం అవసరమేమో అని అభిప్రాయపడ్డారు. ఒక ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం నా బాధ్యత అనిపించిందని.. సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతున్నది ఇందుకు కారణంగా ఉన్న అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉందనేది నిజం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed