- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వేములవాడ ఆలయాన్ని తీర్చిదిద్దాలి.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రులు కొండ సురేఖ, పొన్నం సమీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో: మరో వందేళ్ల పాటు మనగలిగేలా వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా మాస్టర్ ప్లాన్ చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. దేవాలయాల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు చేపట్టేందుకు అంతే ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సచివాలయంలో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి వేములవాడ ఆలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌ను కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో వివరించారు.
ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఆలయ ప్రాశస్త్యానికి, భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. టూవీలర్, ఫోర్ వీలర్, బస్ పార్కింగ్‌లకు వేర్వేరు స్థలాలను కేటాయించి భక్తులు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా ప్లాన్ చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్దేశించారు. వేద పాఠశాలను శాస్త్ర ప్రమాణాలతో నిర్వహించాలని, విద్యార్థులు ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యనభ్యసించేలా వేదపాఠశాలను తీర్చిదిద్దాలని సూచించారు. బిల్వ వనాన్ని రెండు ఎకరాల్లో ఆహ్లాదభరితంగా, ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందేలా గొప్పగా తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. దేవాలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వ నిధులతో పాటు, సీఎస్ఆర్, దాతల విరాళాలు సేకరించే విధంగా కార్యాచరణను అమలుచేయాలన్నారు.
మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఒక ధర్మగుండం, ఇతరులకు ఒక ధర్మగుండం ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై మంత్రి ఆరా తీశారు. భూసేకరణపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ను ఆదేశించారు. విమాన గోపురం 3,200 చదరపు అడుగులు ఉందని, గోపురం తాపడానికి 16 కిలోల బంగారం అవసరం కాగా, దేవాలయం వద్ద 59 కిలోల బంగారం వున్నట్లు ఈవో వినోద్ వివరించారు.
బంగారు తాపడం పనులకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. త్వరలో ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బంగారు తాపడం పనులను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారు వేములవాడ ఆలయాన్ని దర్శించనున్న నేపథ్యంలో వేములవాడ మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను సమర్పించాలని అధికారులకు నిర్దేశించారు. దేవాలయం వద్ద ఉన్న వెండితో ఉత్సవ మూర్తుల విగ్రహాలను తయారుచేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో సైన్ బోర్డుల ద్వారా భక్తులకు సమాచారాన్ని అందించాలని, ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేలా ఆధ్యాత్మిక, భక్తి పరమైన సంగీతాన్ని వినిపించేలా చర్యలు చేపట్టాలని, స్క్రోలింగ్ బోర్డుల్లో మంచిని పెంపొందించే సూక్తులను ప్రదర్శించాలన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నూతన అన్నదాన సత్రాన్ని ఎంతమంది భక్తులు వచ్చినా ఆకలి తీర్చేలా ప్రణాళికాబద్దంగా నిర్మించాలని అధికారులకు సూచించారు. శాస్త్ర ప్రకారం నిర్మాణాలు జరిగేలా మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయాలని ఆర్కిటెక్ట్‌కు సూచించారు. సంయమనంతో పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, కమిషనర్ హనుమంతు, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్లు కృష్ణవేణి, జ్యోతి, కంచి కామకోటి పీఠం సలహాదారు గోవింద హరి, స్థపతి ఎన్. వల్లి నాయగన్, ప్రధానార్చకులు ఉమేష్, కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూ పాలన స్వర్ణయుగం
దేశంలో నెహ్రూ పాలన స్వర్ణయుగం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నెహ్రూ ఆధునిక భారతదేశ రూపశిల్పి అని కొనియాడారు. శక్తివంతమైన దేశంగా ఎదగడంలో నెహ్రూ అమలు చేసిన ప్రణాళికలు, విధానాలు అద్వితీయమైన పాత్ర పోషించాయన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెహ్రూ ఆశయాల సాధనకు అహర్నిషలు కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు.
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హోదాలో హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు ఎన్ని రోజుల్లో జమ అవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లతో మాట్లాడి వీలైనంత త్వరలో మిల్లులకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం నిల్వకు సంబంధించిన సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు.
వేములవాడ ఆలయాన్ని తీర్చిదిద్దాలి.. మాస్టర్ ప్లాన్‌పై మంత్రులు కొండ సురేఖ, పొన్నం సమీక్షప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు, ప్రత్యేక కాంటాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్లు తెలిపారు. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారుల సమన్వయంతో ధాన్యం అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తేమ పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు భోజనాలు అందించే అంశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. రోజువారి ధాన్యం సేకరణ, సేకరించిన దొడ్డు రకం, సన్న రకం ధాన్యం వివరాలు, కొనుగోలు కేంద్రాలు, రైతులు, రైతులకు చేసిన చెల్లింపుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రతి రోజు తన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లతో రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి, మిక్కిలినేని మను చౌదరి పాల్గొన్నారు.