- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర టాపర్లుగా నిలిచిన వాగ్దేవి విద్యార్థులు..
దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో అంకిత 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్ గా నిలిచింది. బైపీసీలో సానియా, అనుష్క 989 మార్కులను సాధించగా, భాగ్యలక్ష్మి 988 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరం బైపిసి విభాగంలో నవ్య శ్రీ 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ టాపర్ గా నిలిచింది.ఎంపీసీ విభాగంలో ముస్రాఫ్ అలీ, సానియా 454 మార్కులు సాధించి సత్తా చాటుకున్నారు.
అత్యుత్తమ ఫలితాలను సాధించి జిల్లాకు ఖ్యాతిని తీసుకువచ్చిన విద్యార్థులను, కళాశాల అధ్యాపకులను, సిబ్బందిని మంత్రి శ్రీనివాస్ గౌడ్, కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి, ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మునుముందు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి, ఐఐటి, నీట్ అకాడమీ ఇన్చార్జ్ పావని, కళాశాల యాజమాన్యం కోట్ల శివకుమార్, రాఘవేంద్రరావు, నాగేందర్, మేఘ్య నాయక్, నరేష్, సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.