- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం కంటే.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో చేరడం ప్రయోజనకరమని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విషయం తనకు తెలియనే తెలియదన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. షర్మిల ఇంటింటికి, గ్రామ గ్రామాన తిరిగిందని గుర్తుచేశారు. టీ-కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లడం లేదన్నారు.
సేవ్ డెమోక్రసీ పేరుతో పాట్నలో విపక్షాల సమావేశం జరిగిందన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయాలనుకోవడం స్వాగతిస్తున్నమని, సిమ్లాలో ఖర్గే నేత్రుత్వంలో మరోసారి సమావేశం జరగనుందని వెల్లడించారు. మోడీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయిందని, ఎవరి నోట చూసిన కాంగ్రెస్ పేరు వినిపిస్తుందని అన్నారు.