ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

by Satheesh |   ( Updated:2023-12-05 07:17:55.0  )
ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఉత్తమ్ ఎంపీ పదవికి రిజైన్ చేయనున్నారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన లోక్ సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ నుండి సీఎం రేసులో ఉన్న ఆయన ఇవాళ సడెన్‌గా ఢిల్లీ వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. ఈ రోజు సాయంత్రం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. దీంతో ఇవాళ సాయంత్రం సస్పెన్స్‌ వీడనుంది.

Also Read..

BREAKING: తెలంగాణ సీఎం ఎంపికపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన

Advertisement

Next Story