- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Shridhar Babu : కుల గణనతోనే ప్రతి ఒక్కరికి న్యాయం
దిశ, శంషాబాద్ : కుల గణనతోనే ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పద్మావతి గార్డెన్ లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే పై నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.
అతిథులుగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ…రాహుల్ గాంధీ గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జూడో యాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కులగణను చేపడతామని చెప్పిన వాగ్దానం లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాహుల్ గాంధీ ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేసి తీరుతామని ముందడుగు వేశారన్నారు. ఈ కులగనలతో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేయాలని ఉద్దేశంతో నవంబర్ తేదీలోపు కులగణనను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందన్నారు.
ఈ కులగణలో 85 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, 150 ఇండ్లను ఒక డివిజన్ గా ఏర్పాటు చేసి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సర్వేలో 56 అంశాలను ప్రస్తావించడం జరుగుతుందన్నారు. ఈ సర్వే చేయడానికి ఇంటికి వచ్చిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉండి ప్రతి కుటుంబం వద్ద సర్వే వివరాలను వివరించే విధంగా అధికారులకు సహకరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు వచ్చాయన్నారు. కార్పొరేషన్ పదవులు వచ్చి వారికి పార్టీ ఆదరించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో పదవులు రాని వారికి ఏ విధంగా పదవులు ఇవ్వాలి ఏ విధంగా ఆదుకుంటామనేది అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్ణయించడం జరుగుతుందన్నారు. కులగణ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. దీనికి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. కులగణన చేయాలనే నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని అన్నారు. ఈ కులగణ సర్వేలను ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త అధికారులకు వెన్ను దండుగా ఉండి ఈ సర్వేను విజయవంతం చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు చిలక మధుసూదన్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, ఎలుగని మధుసూదన్ రెడ్డి, కాంటెస్ట్ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భారత్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, రాచమల్ల సిద్దేశ్వర్, సంజయ్ యాదవ్, కోటేశ్వర్ గౌడ్, శేఖర్ యాదవ్, రఫిక్, ప్రభాకర్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.