మా మామయ్య ఫంక్షన్‌కు రావాలి! గవర్నర్ తమిళిసైని కలిసిన ఉపాసన

by Ramesh N |   ( Updated:2024-02-02 14:19:26.0  )
మా మామయ్య ఫంక్షన్‌కు రావాలి! గవర్నర్ తమిళిసైని కలిసిన ఉపాసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌కు వెళ్లిన ఉపాసన గవర్నర్‌ను కలిసి జ్ఞాపికను బహుకరించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉపాసన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. గిరిజన సంక్షేమం కోసం గవర్నర్ పాటుపడుతున్నారని అభినందనలు తెలిపారు.

గిరిజనుల కోసం పనిచేయడం నిజంగా తన హృదయాన్ని తాకిందని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ కలయిక పై గవర్నర్ తమిళిసై సైతం ట్వీట్ చేశారు. తాజాగా పద్మవిభూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవికి అవార్డు పొందిన నేపథ్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సంర్భంగా గవర్నర్‌ను ఉపాసన ఆహ్వానించారు.

Advertisement

Next Story