- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
G Kishan Reddy Health update : ఎయిమ్స్ వైద్యులు ఏమన్నారంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెకు సంబంధించి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కిషన్ రెడ్డిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన్ను డాక్టర్లు క్రిటికల్ కార్డియాక్ యూనిట్‌లో ఉంచి వైద్యం అందిస్తు్న్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కిషన్ రెడ్డి కడుపులో గ్యాస్ ఫామ్ అయిందని తెలిపారు. అందువల్ల ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి కొంత విశ్రాంతి తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని డాక్టర్లు సూచించారు. సాయంత్రానికి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.
కాగా, ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమం జరిగింది. ఈ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని ఢిల్లీ నేషనల్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్‌లో మోదీ ప్రసంగించిన అంశాల ఆధారంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని కిషన్ రెడ్డి ప్రారంభించారు.
మరోవైపు తెలగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గంగా పుష్కరాలు, పూరీ-కాశీ-ఆయోధ్యను సందర్శించేందుకు ఏర్పాటు చేసిన ‘భారత్ గౌరవ్’ రైలును సికింద్రాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అలాగే హైదరాబాద్ నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు. తీరిక లేని షెడ్యూల్స్ వల్ల కిషన్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.