Kishan Reddy: మావోయిస్టులు తప్పకుండా ఆ సినిమా చూడాలి.. కిషన్ రెడ్డి సంచలన పిలుపు

by Gantepaka Srikanth |
Kishan Reddy: మావోయిస్టులు తప్పకుండా ఆ సినిమా చూడాలి.. కిషన్ రెడ్డి సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు(Maoists)లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన పిలుపునిచ్చారు. సోమవారం అమీర్‌పేట్‌లోని ఏషియన్ సత్యం థియేటర్‌లో జితేందర్ రెడ్డి సినిమా(Jitender Reddy Movie)ను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు జితేందర్ రెడ్డి బీజేవైఎం(BJYM)లో పనిచేశారని గుర్తుచేశారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో పేదల పక్షాన నిలబడి జాతీయవాదం కోసం పోరాడారని అన్నారు. వరంగల్‌లో బీజేవైఎం సభ నిర్వహించినపుడు సుమారు 50 బస్సుల్లో జగిత్యాల నుంచి జనాన్ని తరలించి సభను జయప్రదం చేశారని తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా వెనుకడుగు వేయని ధైర్యవంతుడు జితేందర్ రెడ్డి అని కొనియాడారు. మావోయిస్టులు ఆయన్ను చుట్టుముట్టి హత్య చేయడం చూశాను. హింస ద్వారా ఏమీ ఉపయోగం లేదని తెలిసినా తన మద్దతుదారులను కాపాడుకునేందుకు ఆయన తుపాకీ పట్టాల్సి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు కూడా కొందరు తుపాకీ(GUN) ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని భావిస్తున్నారు. తుపాకీ బుల్లెట్ కంటే ఓటు బుల్లెట్(బ్యాలెట్) ద్వారా సమాజంలో మార్పు సాధ్యమని అంబేద్కర్ చెప్పారని తెలిపారు. జితేందర్ రెడ్డి(Jitender Reddy)కి ప్రాణానికి హాని ఉందని తెలిసినా ఆయన తండ్రి మల్లారెడ్డి ఏనాడూ జితేందర్ రెడ్డి పోరాటానికి అడ్డు చెప్పలేదని అన్నారు. 72 బుల్లెట్లు జితేందర్ రెడ్డి శరీరంలో దింపారు. ఆ పోరాటంలో జితేందర్ రెడ్డి వీర మరణం పొందారని చెప్పారు. జితేందర్ రెడ్డి సినిమాను మావోయిస్టులు తప్పకుండా చూడాలని పిలుపునిచ్చారు. అమాయకుల ప్రాణాలు తీసే హక్కు వారికెక్కడిని ప్రశ్నించారు. ఇప్పటికే ఎంతో మందిని వారు హత్య చేశారు. గిరిజనులను కూడా ఇంకా హత్య చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. మావోయిస్టులు హింసను వదిలేసి ప్రజాస్వామ్యంలోకి రావాలని సూచించారు. బీసీ జనాభా సేకరణకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించారు.

Advertisement

Next Story