మా తప్పులే కొంప ముంచాయి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Javid Pasha |
మా తప్పులే కొంప ముంచాయి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక ఎన్నికల్లో తమ తప్పులే తమ కొంప ముంచాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ ఓటమి స్వయంకృతాపరాధమని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగానే ఓడిపోయినట్లు చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఒక తప్పు చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ వంద తప్పులు చేసిందని ఆయన విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. కర్ణాటక ప్రజల తీర్పును శిరసా వహిస్తామని, లోక్ సభ ఎన్నికల నాటికి తిరిగి పుంజుకుంటామన్నారు.

తప్పులను సరిచేసుకుని లోకసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతామని కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో స్థానిక ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయినట్లు తెలిపారు. తొందర్లోనే తాము చేసిన లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు ధైర్యం వస్తుందనడం వట్టి ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టివేశారు.

Advertisement

Next Story