వాస్తవాల ఆధారంగా తీసిన సినిమా ‘‘ది కేరళ స్టోరీ’’: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-05-16 15:42:25.0  )
వాస్తవాల ఆధారంగా తీసిన సినిమా ‘‘ది కేరళ స్టోరీ’’: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తీవ్రవాద సమస్య ఇండియాలోనే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణగూడ శాంతి థియేటర్‌లో ది కేరళ స్టోరీ చిత్రాన్ని మంగళవారం ఆయన వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళ స్టోరీస్ సినిమాపై అనేక వార్తలు వచ్చాయని, కానీ వాస్తవాల ఆధారంగా సినిమా తీశారని ఆయన చెప్పారు.

మతాన్ని పెంచుకోవడం కోసం, తమ మత ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం నమ్మించి, మోసం చేసి అనేక రకాలుగా హింసించిన ఘటనలు అనేకం చూశామన్నారు. సినిమా చూసిన తరువాత ఈ దేశంలో కొంతమంది ఎలా దౌర్జన్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. తీవ్రవాదాన్ని అన్ని మతాలు వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు. కలిసి కట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. లవ్ జిహాదీ పేరుతో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సికింద్రాబాద్‌లోని స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటుచేసిన రోజ్ గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురికి నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే రిక్రూట్ మెంట్లు ఆగిపోతున్నాయో తెలుసని ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియను చేపడుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

గత పాలనలో కేంద్రంలోని అనేక రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన వెల్లడించారు. భారత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని మిషన్ మోడ్ లో చేపడుతోందన్నారు. పది లక్షలకు పైగా ఉద్యోగాలు అందించే కార్యక్రమం నాలుగు నెలల క్రితం ప్రారంభమైందని, స్వయంగా ప్రధాని మోడీ ఉద్యోగులకు నియామక పత్రాలు అందిస్తున్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed